ప్రజావాణి వినతుల పరిష్కారంలో వేగం పెంచాలి

​జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశం

ప్రజావాణి వినతుల పరిష్కారంలో వేగం పెంచాలి

హైదరాబాద్

 ప్రజావాణి కార్యక్రమంలో పౌరుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను ఏమాత్రం జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి'లో ఆయన అదనపు కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
​మొత్తం 67 ఫిర్యాదులు సోమవారం నాటి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి 35 వినతులు రాగా, నగరంలోని ఆరు జోన్ల పరిధిలో మరో 32 అర్జీలు అందాయి. మొత్తం 67 ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, వాటిని సంబంధిత విభాగాలకు బదిలీ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
​ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. "విభాగాల వారీగా అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. నిబంధనల మేరకు సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించి బాధితులకు ఊరటనివ్వాలి" అని ఆయన పేర్కొన్నారు.
​హాజరైన అధికారులు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రవికిరణ్, సత్యనారాయణ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహారెడ్డి, సీసీపీ శ్రీనివాస్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ రమాదేవి, జాయింట్ కమిషనర్లు జయంత్, రజనీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About The Author