పేదల జీవన ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యం
నాదర్‌గుల్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి హాజరైన పారిజాత నర్సింహారెడ్డి
బడంగ్‌పేట:
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గుల్ డివిజన్ అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుడు వంక లింగం గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందని, పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్, నాయకులు పేతుళ్ల ఆనంద్ రెడ్డి, బంగారి అశోక్, మర్రి లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
