ఏరియా ఆసుపత్రిలో హ్యూమన్ పాఫిలోమా వైరస్ టీకా ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్
వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ నందు (HPV) వ్యాక్సిన్ ( హ్యూమన్ పాఫీలోమా వైరస్ టీకా) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏటా కొత్తగా 55 నుంచి 60 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్. పీ.వీ వ్యాక్సిన్ ( హ్యూమన్ పాఫీలోమా వైరస్) వ్యాక్సినేషన్ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిట్టా రాజశేఖర్ రెడ్డి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, మహేశ్వరం, వనస్థలిపురం సూపరిడెంట్లు నాగేందర్, కృష్ణ,వనస్థలిపురం ఆర్ఏంఓ జయమాల,పలువురు డాక్టర్లు గఫర్,అనిత, కిరణ్, గీత, అర్చన,సుస్మిత,స్వర్ణలత,తిరుమల రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ రావు, అనురాధ, మాధవి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
