పత్రికా ప్రకటన
నేడు బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అవగాహన సమావేశం
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమంపై నేడు (శుక్రవారం, జూలై 3, 2026) బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఒక ముఖ్యమైన అవగాహన సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది .ఈ సమావేశానికి గౌరవ డిప్యూటీ సీఈఓ (Dy.CEO) జయచంద్ర రెడ్డి, ఆర్డీఓ (RDO) జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వి.సమ్మయ్య మరియు డిప్యూటీ తహశీల్దార్ నరేష్‌లు ముఖ్య అతిథులుగా హాజరై, అధికారులకు మరియు ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు .
ఈ సమావేశం ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమం ఎలా నిర్వహించాలి మరియు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాలను (Enumeration Forms) ఎటువంటి తప్పులు లేకుండా ఏ విధంగా భర్తీ చేయాలో అధికారుల బృందం సమావేశంలో పాల్గొన్న వారికి క్షుణ్ణంగా వివరించారు. : స్థానిక కాలనీలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితా నిష్పాక్షికంగా ఉండేలా చూసేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని మరియు ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయడానికి తమ పూర్తి సహకారాన్ని అందించాలని అధికారులు కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియపై సమావేశానికి హాజరైన వారి నుండి ఫీడ్‌బ్యాక్ స్వీకరించడమైనది.
ఈ సమన్వయ సమావేశానికి ఎస్‌హెచ్‌జీ (SHG) గ్రూపుల పొదుపు సంఘాల సభ్యులు మరియు బడంగ్‌పేట్ పరిధిలోని కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు (Colony Association Members) పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక కాలనీలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితా నిష్పాక్షికంగా ఉండేలా చూసేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు క్రియాశీలక పాత్ర పోషించి ఈ సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇట్లు,
కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ / ఎన్నికల విభాగం
బడంగ్‌పేట్ సర్కిల్,16. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
About The Author
04 Jul 2026
