చేయూత పింఛన్ లబ్ధిదారుల లైవ్‌నెస్ ఆథెంటికేషన్ గడువు 27 వరకు పొడిగింపు
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో కేవైసీ పూర్తి చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ వెల్లడి
బడంగ్పేట్:
చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల లైవ్‌నెస్ ఆథెంటికేషన్ (కేవైసీ) గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బడంగ్పేట్ సర్కిల్–16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
*కార్యాలయంలోనే ఆథెంటికేషన్ ప్రక్రియ
బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న అన్ని వర్గాల చేయూత పింఛన్ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. లబ్ధిదారులందరూ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి తమ లైవ్‌నెస్ ఆథెంటికేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.
నిర్ణీత గడువులోపు లైవ్‌నెస్ ఆథెంటికేషన్ పూర్తి చేయని పక్షంలో పింఛన్ చెల్లింపుల్లో జాప్యం లేదా అంతరాయం కలిగే అవకాశం ఉందని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. అందువల్ల ప్రతి లబ్ధిదారుడు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, వెంటనే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.
