మహేశ్వరం నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ..

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.

మహేశ్వరం నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ..

బాలాపూర్:

మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి బాలాపూర్ డివిజన్ లో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు, లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదట బాలాపూర్ డివిజన్ లో మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె గుర్తు చేశారు.
అనంతరం బాలాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు తుళ్ళ నర్సింగ్ గౌడ్ గారి నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు.
ఈ రెండు కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు గౌడ్, టేకుల శశిధర్ రెడ్డి, పగడాల ఉమేష్, అరవింద్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-24 at 17.57.26 (1)

About The Author