గోల్డ్ మెడల్ కోసం చైనాతో ఢీ.. భారత్‌కు కీలకంగా 7వ రోజు..
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో 7వ రోజు భారత్‌కు కీలకంగా మారింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో అథిత్య చైనాతో భారత్ తలపడనుంది. ఫైనల్ పోరులో చైనాతో భారత జోడి సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ అమితుమి తేల్చుకోనున్నారు. వీరు ఇప్పటికే 577 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇదే విభాగంలో కాంస్య పతక పోరులో పాకిస్థాన్, జపాన్, కొరియా, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా క్రీడల్లో పతకాల వేటలో భారత్‌కు కీలక ఆటగాళ్లైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్- బోపన్న, రుతుజా భోసలే వంటి స్టార్ ఆటగాళ్లు నేడు బరిలోకి దిగుతున్నారు. స్క్వాష్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పురుషుల 1500 మీటర్ల పోరులో అజయ్ కుమార్ సరోజ్ 3:51.93 టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో మురళీ శ్రీశంకర్, మహిళల 100 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజి కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో వీరంతా నేడు ఫైనల్ పోరులో గోల్డ్ మెడల్ కోసం తలపడనున్నారు. భారత పురుషుల హాకీ జట్టు నేడు పాకిస్థాన్‌తో తలపడనుంది. అంతేకాకుండా భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నేడు సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా 7వ రోజు కూడా భారత్ పలు విభాగాల్లో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. ఆసియా క్రీడల ఆరో రోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి. ఆరో రోజు మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. దీంతో మొత్తం భారత్ పతకాల సంఖ్య 33కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆరో రోజు గురి తప్పని షూటర్ల తూటాలు పతకాలు కురిపించాయి. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పాలక్ గులియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇషాసింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే ఇషా-పాలక్-దివ్య త్రయం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ కేటగిరీలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్, స్వప్నిల్ కుశాలే, అఖిల్ షెరాన్ బృందం ఏకంగా వరల్డ్ రికార్డుతో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో 7వ రోజు భారత్‌కు కీలకంగా మారింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో అథిత్య చైనాతో భారత్ తలపడనుంది. ఫైనల్ పోరులో చైనాతో భారత జోడి సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ అమితుమి తేల్చుకోనున్నారు. వీరు ఇప్పటికే 577 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇదే విభాగంలో కాంస్య పతక పోరులో పాకిస్థాన్, జపాన్, కొరియా, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా క్రీడల్లో పతకాల వేటలో భారత్‌కు కీలక ఆటగాళ్లైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్- బోపన్న, రుతుజా భోసలే వంటి స్టార్ ఆటగాళ్లు నేడు బరిలోకి దిగుతున్నారు. స్క్వాష్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పురుషుల 1500 మీటర్ల పోరులో అజయ్ కుమార్ సరోజ్ 3:51.93 టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో మురళీ శ్రీశంకర్, మహిళల 100 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజి కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో వీరంతా నేడు ఫైనల్ పోరులో గోల్డ్ మెడల్ కోసం తలపడనున్నారు. భారత పురుషుల హాకీ జట్టు నేడు పాకిస్థాన్‌తో తలపడనుంది. అంతేకాకుండా భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నేడు సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా 7వ రోజు కూడా భారత్ పలు విభాగాల్లో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి.
ఆసియా క్రీడల ఆరో రోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి. ఆరో రోజు మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. దీంతో మొత్తం భారత్ పతకాల సంఖ్య 33కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆరో రోజు గురి తప్పని షూటర్ల తూటాలు పతకాలు కురిపించాయి. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పాలక్ గులియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇషాసింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే ఇషా-పాలక్-దివ్య త్రయం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ కేటగిరీలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్, స్వప్నిల్ కుశాలే, అఖిల్ షెరాన్ బృందం ఏకంగా వరల్డ్ రికార్డుతో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.
