చైతన్యపురిలో పోలీస్ అభ్యర్థుల మహా ధర్నా

చైతన్యపురిలో పోలీస్ అభ్యర్థుల మహా ధర్నా

ఎల్బీనగర్:

పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపుతో పాటు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పోలీస్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో చైతన్యపురిలో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీస్ అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, 19/20 పే స్కేల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్‌ఐ పోస్టులకు 38 సంవత్సరాల వయోపరిమితి కల్పించాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా ధర్నాలో పెద్ద సంఖ్యలో పోలీస్ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పాల్గొని సంఘీభావం తెలిపారు.

About The Author