జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన ధర్పల్లి.త్రిశాంక్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు
జాతీయ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని ప్రశంసించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
*హైదరాబాద్:
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దర్పల్లి త్రిశాంక్‌ను రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కుమారుడైన త్రిశాంక్ నివాసానికి మంత్రి స్వయంగా వెళ్ళి, అతడిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
*విద్యార్థి విజయం ప్రశంసనీయం: మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే ఈ ప్రవేశ పరీక్షలో త్రిశాంక్ సాధించిన విజయం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. సాంకేతిక రంగంలో దేశ విదేశాల్లో రాణించేందుకు ఇటువంటి ఫలితాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో త్రిశాంక్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, అటు కుటుంబానికి, ఇటు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేటి తరం విద్యార్థులకు త్రిశాంక్ విజయం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
"లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం అసాధ్యమేమీ కాదు."
మంత్రి శ్రీధర్ బాబు తమ నివాసానికి విచ్చేసి, కుమారుడిని ప్రత్యేకంగా అభినందించడం పట్ల త్రిశాంక్ తండ్రి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తమ కుమారుడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

