నబీల్ కాలనీ దశాబ్దాల కష్టాలకు మోక్షం:
- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో రూ.18.25 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం
- *రూ.16 కోట్లతో వ్యూహాత్మకంగా వరద కాలువ (నాలా) నిర్మాణం పూర్తి
- *రూ.2.25 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేసిన మాజీ మంత్రి
- *చంద్రాయణగుట్ట - తుక్కుగూడ రహదారి విస్తరణకు రూ.85 కోట్లు.. త్వరలోనే టెండర్లు పూర్తి: సబితమ్మ వెల్లడి.
*హైదరాబాద్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లి నబీల్ కాలనీ ప్రాంతంలో ఏళ్ల తరబడి స్థానిక ప్రజలను పీడిస్తున్న డ్రైనేజీ, వరద నీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. స్వల్ప వర్షానికే జలమయమై, ఇళ్లలోకి నీరు చేరి కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్న ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి భారీ నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
సబితమ్మ పట్టుదలతోనే రూ.16 కోట్ల వరద కాలువ పూర్తి
గతంలో నబీల్ కాలనీ ఎదుర్కొంటున్న ప్రధాన వరద ముంపు సమస్యను అధిగమించడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SNDP) కింద కొత్తమానుకుంట నుండి నబీల్ కాలనీ వరకు ప్రత్యేక వరద కాలువ (నాలా) నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, పనులు సంపూర్ణంగా పూర్తి కావడానికి అదనంగా మరో రూ.6 కోట్లు అవసరం కాగా.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆ అదనపు నిధులను కూడా ప్రభుత్వం నుండి మంజూరు చేయించారు. ప్రస్తుతం ఈ వరద కాలువ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో కాలనీ వాసులకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం లభించింది.
వరద నీటి సమస్యే కాకుండా, కాలనీల్లో అంతర్గత రాకపోకలు సులువుగా మారేందుకు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ నిర్వహించారు. నబీల్ కాలనీ, కొత్తపేట ప్రాంతాలలో రూ.2 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంతర్గత సిమెంట్ రహదారులు (CC Roads), కాంక్రీట్ మురుగునీటి కాల్వల (RCC Drainage) నిర్మాణ పనులను ఆమె అధికారికంగా ప్రారంభించారు. జల్పల్లి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులన్నింటినీ అత్యంత నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
*ప్రజల కష్టాలు తీర్చడమే నా ప్రథమ ప్రాధాన్యత: సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నబీల్ కాలనీ ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశానని, వాటిని పరిష్కరిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు.
త్వరలోనే రూ.85 కోట్లతో శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ"
ప్రాంతీయ అనుసంధానాన్ని, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేలా శ్రీశైలం రహదారి విస్తరణ పనులకు కూడా ఆమోదం లభించిందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. చంద్రాయణగుట్ట నుండి తుక్కుగూడ వరకు రూ.85 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరిందని, అత్యంత త్వరలోనే ఈ నిర్మాణ పనులు సైతం ప్రారంభం కానున్నాయని తెలిపారు. జల్పల్లి ప్రాంత రూపురేఖలను మార్చేలా, ప్రజల రవాణా కష్టాలను తీర్చేలా ఈ రహదారి విస్తరణ ఉపయోగపడనుందని ఆమె పేర్కొన్నారు.
ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగుతున్న ఈ అభివృద్ధి సంకల్పంలో స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని సబితా ఇంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
