మేడిపల్లి హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి విశేష స్పందన
ఉత్సాహంగా పాల్గొన్న 200 మందికి పైగా కొనుగోలుదారులు ఈ నెల 24న ఈ-వేలం
*హైదరాబాద్:
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి మంగళవారం ప్రాజెక్టు స్థలంలో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సమావేశానికి 200 మందికి పైగా భావి బిడ్డర్లు హాజరై, లేఅవుట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
*సందేహాల నివృత్తి
సమావేశంలో పాల్గొన్న బిడ్డర్ల సందేహాలకు హెచ్‌ఎండీఏ అధికారులు, సాంకేతిక ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. లేఅవుట్ ముఖ్యాంశాలను డిప్యూటీ కలెక్టర్ వై. సుదర్శన్ వివరించగా.. ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మేడిపల్లి లేఅవుట్ ప్రత్యేకతలపై కేపీఎంజీ ప్రతినిధి కళ్యాణ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ-వేలం నిర్వహణ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాలను ఎంఎస్‌టీసీ ప్రతినిధి సిద్ధార్థ్ వివరించారు. లేఅవుట్ స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సాంకేతిక అంశాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సత్యప్రసాద్ వెల్లడించారు.
ఈ నెల 24న (24.6.2026) జరగబోయే ఈ-వేలంపై కొనుగోలుదారులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ ముఖాముఖి చర్చా కార్యక్రమంతో వేలం ప్రక్రియపై స్పష్టత వచ్చిందని అధికారులు తెలిపారు.
.jpeg)
About The Author
17 Jun 2026
