గీతంలో ప్రాజెక్టు అసోసియేట్ అవకాశం

పరిశోధనా ప్రాజెక్టు కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రధాన పరిశోధకురాలు

గీతంలో ప్రాజెక్టు అసోసియేట్ అవకాశం

పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ సైన్స్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వారి అడ్వాన్స్డ్ రీసెర్చ్ గ్రాంట్ (ఏఆర్జీ) పథకం ద్వారా నిధులు సమకూర్చే ఒక ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్టు కింద ప్రాజెక్ట్ అసోసియేట్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘టమాటా మొక్కల వ్యాధికారకాలను ఎదుర్కోవడానికి నియంత్రిత శిలీంధ్రనాశక పంపిణీ కొరకు ప్రేరక-ప్రతిస్పందన జీవఅనుకరణ సిలికా-చిటోసాన్ నానో వాహకాలు’ అనే శీర్షికతో ఈ పరిశోధన ప్రాజెక్టును చేపడుతున్నా మన్నారు. అధునాతన నానోటెక్నాలజీ ఆధారిత పరిష్కారాల ద్వారా మొక్కల వ్యాధుల నిర్వహణ కోసం వినూత్నమైన, సుస్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. 

ఈ పరిశోధన ప్రాజెక్టు గీతం హైదరాబాదు ప్రాంగణంలో, ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ టి.స్వరూప రాణి, సహ-ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ గౌసియా బేగం పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.

మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వ్యవసాయ శాస్త్రాలు, బయోకెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ లేదా సంబంధిత విభాగాలలో ఎమ్మెస్సీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. మొక్కల శిలీంధ్ర వ్యాధికారకాలను నిర్వహించడం, నానోమెటీరియల్ సంశ్లేషణ, లక్షణాల నిర్ధారణ, గ్రీన్ హౌస్ ప్రయోగాలు, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్ లలో అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఈ నియామకం ప్రారంభంలో ఒక ఏడాదికి ఉంటుందని, సంతృప్తికరమైన పనితీరు, ప్రాజెక్టు అవసరాలకు లోబడి, గరిష్టంగా మూడేళ్ల వరకు పొడిగించబడుతుందని స్పష్టీకరించారు. ఎంపికైన అభ్యర్థికి, తొలి ఏడాది నెలకు 30 వేల రూపాయల ఫెలోషిప్ తో పాటు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) లభిస్తుందన్నారు.

సిలికా-చిటోసాన్ ఆధారిత నానో క్యారియర్ల అభివృద్ధి, లక్షణాల నిర్ధారణ, శిలీంధ్రనాశక ఫార్ములేషన్ అధ్యయనాలు, శిలీంధ్రనాశక సామర్థ్య మదింపు, వ్యాధికారక సంబంధిత పరిశోధనలు, వ్యాధి నియంత్రణ వ్యూహాల గ్రీన్ హౌస్ మూల్యాంకనంలో ప్రాజెక్టు అసోసియేట్ చురుకుగా పాల్గొనాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఇటీవలి బయోటా, వారి పరిశోధనా ఆసక్తులు, సంబంధిత అనుభవాన్ని వివరిస్తూ ఒక సంక్లిప్ల లేఖతో పాటు విద్యా సర్టిఫికెట్ల నకళ్లను డాక్టర్ స్వరూప రాణి ఈమెయిల్ stirupaa@gitam.eduకు, ఈనెల 22వే తేదీలోగా పంపాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేసి, ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రధాన పరిశోధకురాలిని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు.

About The Author