మరో వివాదంలో తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం..!
- చేవెళ్ల ఉద్యోగి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉండడం పై సందేహాలు – విలువైన రికార్డుల పరిశీలన పై చర్చ
- మీడియా ప్రతినిధులతో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ దురుసు వైఖరి?
- చార్జీల పెంపు, కార్యాలయ నిర్వహణపై డాక్యుమెంట్ రైటర్ల అసంతృప్తి
తాండూరు:
తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. చేవెళ్ల కార్యాలయానికి చెందిన ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావడం, అక్కడ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి కొన్ని కీలక రికార్డులను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పట్టణంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా
చేవెళ్ల పరిధికి చెందిన అధికారి(శ్రీనివాస్ యాదవ్)తాండూర్ కార్యాలయంలో ఏ అవసరంతో వచ్చారనే విషయం పై స్థానిక వర్గాల్లో
చర్చలు సందేహాలు నెలకొన్నాయి. దీంతో తాండూర్ పట్టణం వ్యాప్తంగా ఈ చర్చ కొనసాగింది.
.ఈ సందర్భంగా కార్యాలయంలోని కొన్ని విలువైన రికార్డులను పరిశీలించినట్లు సమాచారం రావడంతో కొందరు మీడియా ప్రతినిధులు తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంకు చేరుకొని ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పై సందేహాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివిధ సేవల చార్జీల పెంపుపై ప్రజల నుంచి, డాక్యుమెంట్ రైటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని ఈ చార్జీల పెంపు వెనుక సంబంధిత ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపణను ఉన్నట్లుగా సబ్ రిజిస్టర్ లను ప్రశ్నించారు. దీంతో
మీడియా ప్రతినిధులతో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ దురుసుగా ప్రవర్తిస్తూ సమాధానాన్ని దాటవేశారు ఆ సమయంలో చేవెళ్ల ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి ముఖానికి మాస్కు ధరించి కార్యాలయం నుంచి హడావిడిగా పరిగెత్తాడు.
శ్రీనివాస్ యాదవ్ ని కూడా ప్రశ్నించుగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పరిగెత్తాడు.
ఇక కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై డాక్యుమెంట్ రైటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.,
చేవెళ్ల అధికారికి తాండూర్ కార్యాలయంలో ఏం పని?" అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలని డాక్యుమెంట్ రైటర్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు.
గతంలో శ్రీనివాస్ యాదవ్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈయన డిప్టేషన్ పై ఉండి కూడా రిజిస్ట్రేషన్లు చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి.jpeg)
