పార్టీ బలోపేతంపై వెన్నెల గద్దర్ కసరత్తు
మధుయాష్కి గౌడ్‌తో భేటీ.. కమిటీల ఏర్పాటుపై చర్చ
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త (కోఆర్డినేటర్), రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ బుధవారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
నియామకాలపై దృష్టి
ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకం, డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మధుయాష్కి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వెన్నెల గద్దర్‌ను ఆయన శాలువాతో సత్కరించారు.
అనంతరం రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వట్టికూటి రామారావు గౌడ్, పార్టీ నాయకులు గౌని నరసింహ, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు, బండి సురేందర్ తదితరులు మధుయాష్కిని కలిసి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
About The Author
23 Apr 2026
