పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చప్పిడి సావిత్రి నియామకం
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 11: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయిని గూడెం గ్రామానికి చెందిన చప్పిడి సావిత్రి రెండోసారి ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షురాలిగా చప్పిడి సావిత్రిని నియమిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం సమావేశమైన మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, అధ్యక్షురాలు సునీతా రావు మరియు జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావులు చప్పిడి సావిత్రికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చప్పిడి సావిత్రి మాట్లాడుతూ ఒక దళిత మహిళకు మూడోసారి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలిగా గుర్తింపు నివ్వడం తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరియు అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్ పర్సన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిల గొప్పతనానికి నిదర్శనమని తెలుపుతూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మరియు జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 11:
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయిని గూడెం గ్రామానికి చెందిన చప్పిడి సావిత్రి రెండోసారి ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షురాలిగా చప్పిడి సావిత్రిని నియమిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం సమావేశమైన మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, అధ్యక్షురాలు సునీతా రావు మరియు జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావులు చప్పిడి సావిత్రికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చప్పిడి సావిత్రి మాట్లాడుతూ ఒక దళిత మహిళకు మూడోసారి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలిగా గుర్తింపు నివ్వడం తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరియు అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్ పర్సన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిల గొప్పతనానికి నిదర్శనమని తెలుపుతూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మరియు జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
