ఎమ్మెల్సీగా సంపాదించిన ఆస్తి సున్నా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 12: విద్యా రంగమే సమాజాన్ని సరైన విధానంలో నడిపిస్తుందని, ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందిన సమయంలో ఎంత ఆస్తి ఉందో, ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా అంతే ఆస్తి ఉందని, ఎమ్మెల్సీ ద్వారా అదనంగా, అక్రమంగా తాను ఏమి సంపాదించలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కలకోట, బోనకల్ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గురుకుల బాలికల విద్యాలయంలో గురువారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే పని చేశానన్నారు. అనేక సమస్యల పరిష్కారంలో తాను కీలకపాత్ర నిర్వహించినట్లు తెలిపారు. శాసన మండలిలో ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే, బయట ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా తాను పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.6 సంవత్సరాల ఎమ్మెల్సీగా తనకు సంతృప్తిని ఇచ్చింది అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే తాను విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే కృషి చేస్తానన్నారు. ప్రభుత్వాలు తీసుకువచ్చిన నూతన విద్యా విధానము వల్ల జరిగే అదనపు ఉపయోగం ఏమీ లేదన్నారు. 900 గురుకుల పాఠశాలలు, 900 మోడల్ కాలేజీలలో కనీసం 60 శాతం సీటు కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పిఆర్సి తీసుకురావటంలో తాను ప్రభుత్వంతో అనేకసార్లు పోరాటం చేశానన్నారు. దాని ఫలితంగానే పిఆర్సి ఫిట్మెంట్ పెరిగింది అన్నారు. ఇంకా కొంతమందికి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కాంటీన్ జెన్సి నిధులు ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. కనీసం కాలేజీకి రెండు లక్షల అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి విద్యరంగ సమస్యల పరిష్కారం చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా తాను ఏమి చేయాలో అన్ని చేసి ఆచరణలో చూపించానన్నారు. అందుకోసమే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ రంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జేఏసీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే జేఏసీ ఏర్పడిందని, ఈ జేఏసీలో తాను కీలక పాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటాలు నిర్వహించానని, చాలావరకు సమస్యల పరిష్కారం అయ్యాయాన్ని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జిముక్కులకు పాల్పడవద్దని తాను నేరుగా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను నికరంగా నిలబడి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కారం చేసినట్లు ఆయన తెలిపారు. మన పాలకులు ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయ రంగం పైన ఉందన్నారు. సామాజిక, ఆర్థిక అంతరాలను మన ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ విద్యారంగాన్ని ఉపాధ్యాయ రంగం తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తనకు ఇతర వ్యాపారాలు ఏమీ లేవన్నారు. నన్ను బ్లాక్ మెయిల్ ఎవరు చేయలేరని అందుకోసమే నేను ఉపాధ్యాయ రంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ధైర్యం, హక్కు కలిగి ఉన్నానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు యాకూబ్ పాషా, లెవిన్ స్టాన్, కె విజయ్, పాలకుర్తి రాణి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 12:
విద్యా రంగమే సమాజాన్ని సరైన విధానంలో నడిపిస్తుందని, ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందిన సమయంలో ఎంత ఆస్తి ఉందో, ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా అంతే ఆస్తి ఉందని, ఎమ్మెల్సీ ద్వారా అదనంగా, అక్రమంగా తాను ఏమి సంపాదించలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కలకోట, బోనకల్ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గురుకుల బాలికల విద్యాలయంలో గురువారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే పని చేశానన్నారు. అనేక సమస్యల పరిష్కారంలో తాను కీలకపాత్ర నిర్వహించినట్లు తెలిపారు. శాసన మండలిలో ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే, బయట ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా తాను పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.6 సంవత్సరాల ఎమ్మెల్సీగా తనకు సంతృప్తిని ఇచ్చింది అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే తాను విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే కృషి చేస్తానన్నారు. ప్రభుత్వాలు తీసుకువచ్చిన నూతన విద్యా విధానము వల్ల జరిగే అదనపు ఉపయోగం ఏమీ లేదన్నారు. 900 గురుకుల పాఠశాలలు, 900 మోడల్ కాలేజీలలో కనీసం 60 శాతం సీటు కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పిఆర్సి తీసుకురావటంలో తాను ప్రభుత్వంతో అనేకసార్లు పోరాటం చేశానన్నారు. దాని ఫలితంగానే పిఆర్సి ఫిట్మెంట్ పెరిగింది అన్నారు. ఇంకా కొంతమందికి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కాంటీన్ జెన్సి నిధులు ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. కనీసం కాలేజీకి రెండు లక్షల అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి విద్యరంగ సమస్యల పరిష్కారం చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా తాను ఏమి చేయాలో అన్ని చేసి ఆచరణలో చూపించానన్నారు. అందుకోసమే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ రంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జేఏసీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే జేఏసీ ఏర్పడిందని, ఈ జేఏసీలో తాను కీలక పాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటాలు నిర్వహించానని, చాలావరకు సమస్యల పరిష్కారం అయ్యాయాన్ని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జిముక్కులకు పాల్పడవద్దని తాను నేరుగా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను నికరంగా నిలబడి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కారం చేసినట్లు ఆయన తెలిపారు. మన పాలకులు ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయ రంగం పైన ఉందన్నారు. సామాజిక, ఆర్థిక అంతరాలను మన ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ విద్యారంగాన్ని ఉపాధ్యాయ రంగం తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తనకు ఇతర వ్యాపారాలు ఏమీ లేవన్నారు. నన్ను బ్లాక్ మెయిల్ ఎవరు చేయలేరని అందుకోసమే నేను ఉపాధ్యాయ రంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ధైర్యం, హక్కు కలిగి ఉన్నానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు యాకూబ్ పాషా, లెవిన్ స్టాన్, కె విజయ్, పాలకుర్తి రాణి తదితరులు పాల్గొన్నారు.
