తుక్కాపూర్ స్మృతి వనంలో ఘనంగా సీఎస్ఆర్ జన్మదిన వేడుకలు

- నా జీవితం దుబ్బాక ప్రజల సేవకే అంకితం
- దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

తుక్కాపూర్ స్మృతి వనంలో ఘనంగా సీఎస్ఆర్   జన్మదిన వేడుకలు

దుబ్బాక:

దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు తొగుట మండలంలోని తుక్కాపూర్ స్మృతి వనంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి తన తండ్రి ఆశీర్వాదం పొందారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి  జన్మదినాన్ని అభిమానులు కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితం పూర్తిగా దుబ్బాక ప్రజల సేవకే అంకితం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), చేగుంట ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, బూస నిరంజన్ రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, రవీందర్, తాండ్ర విజయపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, స్వామి, సండ్రుగు శ్రీకాంత్, ప్రవీణ్, నరసింహులు గౌడ్, సిద్ది శ్రీనాకర్ రెడ్డి, గంట రవీందర్, గోపాల్, బండారు లాలు, కర్నాల శ్రీనివాస్ రావు, మాసంపల్లి మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉప్పలయ్య, తిరుపతి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About The Author