గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికలు

  • - నూతన అధ్యక్షుడిగా గుంటుక రవి
  • - ఉపాధ్యక్షులుగా షీర్ల కనకయ్య

గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికలు

గజ్వెల్:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పలువురు పోటీ పడగా, బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు.ఈ ఎన్నికల్లో గుంటుక రవి భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా షీర్ల కనకయ్య, చంద్రం, ప్రధాన కార్యదర్శిగా పేర్క రాము, కోశాధికారిగా భాగమొల్ల నర్సింలు ఎన్నికయ్యారు. ప్రధాన సలహాదారులుగా మల్లేశం, క్యాసరం చంద్రం, గౌరవ అధ్యక్షులుగా గాలెంక నర్సింలు, రొడ్డ బాల్ దుర్గయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ తమకు మద్దతు తెలిపిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ సభ్యుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యజమానులతో చర్చించి పనికి తగిన న్యాయమైన కూలీ లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను యూనియన్ సభ్యులు, మద్దతుదారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సూరారం రాజు, శ్రీరామ్ రాజు, నర్సి మల్లేశం, గుడారి శ్రీను, తలారి నర్సింలు, కొనాపూర్ రమేష్, వెంకటయ్యతో పాటు గజ్వేల్ మండల తాపీ, సెంట్రింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-16 at 19.07.38 (1)

About The Author