భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు అవగాహన

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ సోఫినగర్ కేజీబీవిలో విద్యార్థులకు బాల్య వివాహాలు, గుడ్ టచ్- బ్యాడ్ టచ్, బాలల హక్కులు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 45 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బాలశక్తీ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేస్తూ, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, బాల్య వివాహ నిర్మూలన చట్టం-2006, వివిధ హెల్ప్ లైన్ నెంబర్లు 100, 1098 ,181, 1930, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులంతా అన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ మురళి, జిసిడిఓ సలోమి కరుణ ,కేజీబీవీ ఎస్ఓ సుజాత, మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి, మౌనిక లు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author