అమావాస్య అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్
ఎల్బీనగర్:
సరూర్నగర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో "అమావాస్య" సందర్భంగా రెండు వేల మంది భక్తులకు, పేద ప్రజలకు జరిగిన ప్రత్యేక అన్న వితరణ కార్యక్రమానికి సరూర్నగర్ మండల తహసీల్దార్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై స్వయంగా తన చేతుల మీదుగా అన్నప్రసాదం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దేవాలయానికి మొదటిసారిగా విచ్చేసిన తహసీల్దార్ వేణుగోపాల్ ని దేవాలయం ఫౌండర్ ట్రస్టులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ లు పట్టు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్. వీఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ నోముల కబీర్ దాస్ గౌడ్ గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం రాముని శ్రీనివాస్ గుప్తా, గోల్డెన్ టీం వాకర్స్ అధ్యక్షులు కాశిట్టి నాగేష్ గుప్తా సలహాదారులు ఉప్పల ఎన్టీఆర్ కృష్ణ, కూర శ్రీనివాస్ గుప్తా, సొల్లేటి ఆనంద్ గుప్తాలతోపాటు సరూర్నగర్ మరియు డాక్టర్స్ కాలనీ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
