రాబోయే స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07: రాబోయే స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన స్ధానిక పోలీస్ అధికారులు అప్రమత్తంగా వుంటూ.శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారకుండా ముందస్తుగా పోలీస్ అధికారులు బందోబస్తుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్లు, బూత్‌ల వద్ద పరిస్థితులు, వనరులపై వివరాలు సేకరించాలని సూచించారు. సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేటగిరీల్లో పోలింగ్ బూత్‌లను విభజించే మేరకు బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్న వారు, రౌడీ షీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఎవరెవరిపై కేసులు ఉన్నాయనే వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా సేకరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు ప్రణాళికలు రూపొందించాని సూచించారు. అదేవిధంగా ప్రతి కేసు విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తద్వారా నిందుతులకు శిక్ష పడి నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు , ఏసీపీ వేంకటేశ్, సాంబారాజు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07:
రాబోయే స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన స్ధానిక పోలీస్ అధికారులు అప్రమత్తంగా వుంటూ.శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారకుండా ముందస్తుగా పోలీస్ అధికారులు బందోబస్తుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్లు, బూత్‌ల వద్ద పరిస్థితులు, వనరులపై వివరాలు సేకరించాలని సూచించారు. సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేటగిరీల్లో పోలింగ్ బూత్‌లను విభజించే మేరకు బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్న వారు, రౌడీ షీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఎవరెవరిపై కేసులు ఉన్నాయనే వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా సేకరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు ప్రణాళికలు రూపొందించాని సూచించారు.
అదేవిధంగా ప్రతి కేసు విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తద్వారా నిందుతులకు శిక్ష పడి నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
