నిర్దేశించిన గడువు లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు:
అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున.. పారిశుధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెప్తాను తరలించడంతోపాటు ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెండు సర్కిళ్ల కు సంబంధించిన 250 కోట్ల నిధులు తిరిగి డివిజన్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కేటాయించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, డిఈ వెంకటరమణ, ఏఈ లు ఫైజాన్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
