భోజ్‌శాల ‘సరస్వతీ’ నిలయమే!

  • దశాబ్దాల వివాదానికి తెరదించిన హైకోర్టు.. ముస్లిం పక్షాల వాదనలు తిరస్కరణ
  • ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా కీలక తీర్పు | ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి ఆదేశం.

భోజ్‌శాల ‘సరస్వతీ’ నిలయమే!

హైదరాబాద్:

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న భోజ్‌శాల-కమల్ మౌలా వివాదానికి ఇండోర్ హైకోర్టు సంచలన తీర్పుతో తెరదించింది. పురావస్తు శాఖ (ASI) సమర్పించిన శాస్త్రీయ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం.. ఆ వివాదాస్పద కట్టడం సంస్కృత విద్యాకేంద్రమైన ‘వాగ్దేవి’ (సరస్వతి) ఆలయమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ, సదరు ప్రాంగణాన్ని పూర్తిగా పురావస్తు శాఖ స్వాధీనంలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

చారిత్రక ఆధారాలే కీలకం
ఈ ప్రాంగణం పరమార వంశానికి చెందిన రాజా భోజుడు నిర్మించిన అద్భుతమైన సంస్కృత పాఠశాల అని చరిత్రకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. తాజాగా ఏఎస్‌ఐ నిర్వహించిన 98 రోజుల సుదీర్ఘ సర్వేలో వెలుగుచూసిన అంశాలు కోర్టు తీర్పులో కీలకంగా మారాయి.
 
కట్టడ నిర్మాణ శైలి:
అక్కడ లభించిన శిల్పాలు, స్తంభాలపై ఉన్న చెక్కడాలు హిందూ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉన్నాయని సర్వే తేల్చింది.

 వాగ్దేవి విగ్రహం: ఇక్కడ సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడానికి కోర్టు కేంద్రానికి అనుమతినిచ్చింది.
 
ప్రత్యామ్నాయ మార్గం: మసీదు కోసం ముస్లిం వర్గాలు వేరే స్థలాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది.

ఏమిటీ వివాదం?
మధ్యయుగం నాటి ఈ కట్టడాన్ని హిందువులు వాగ్దేవి ఆలయంగా, ముస్లింలు కమల్ మౌలా మసీదుగా భావిస్తారు. 2003 నుంచి అమల్లో ఉన్న ఏఎస్‌ఐ నిబంధనల ప్రకారం..

 1. మంగళవారం: హిందువులు పూజలు నిర్వహించేవారు.

 2. *శుక్రవారం: ముస్లింలు నమాజ్ చేసుకునేవారు.
అయితే, ఈ ఒప్పందాన్ని సవాలు చేస్తూ హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇది మూలతః ఆలయమని, పూర్తి హక్కులు తమకే కల్పించాలని కోరాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, వాస్తవాలను వెలికితీసేందుకు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది.

బిగుతుగా బందోబస్తు
తీర్పు నేపథ్యంలో ధార్ జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. తీర్పు వెలువడిన వెంటనే హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ముస్లిం పక్షాలు పైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

"ఈ తీర్పు కేవలం ఒక స్థల వివాద పరిష్కారం మాత్రమే కాదు.. మరుగునపడిన భారతీయ విద్యా వైభవానికి, చారిత్రక సత్యానికి లభించిన గుర్తింపు." -

About The Author