కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిట్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

  • పరీక్ష రద్దు పరిస్థితి రావడం సిగ్గుచేటు 
  • పేపర్ లీక్ ఘటన పై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలి 
  •  బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిట్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

వికారాబాద్:

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిట్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిందనీ,
నీట్ పరీక్ష రద్దు పరిస్థితి రావడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు
విమర్శించారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో 
పేపర్ లీక్ ఘటన పై బీఆర్ఎస్వీ నాయకుల ఆధ్వర్యంలో 
నిరసన వ్యక్తం చేశారు.
 ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు మాట్లాడుతూ 
..నీట్ ప్రశ్నాపత్రం లీకై పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు.
2024 సంవత్సరంలో కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఘటన జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, అందుకే మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమైందని విమర్శించారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా జరుగుతున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారాయని అన్నారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, ఈ లీకేజీ వ్యవహారంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని అన్నారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్దవాళ్ల హస్తం ఉన్నా వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని, పూర్తి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజాగుల శ్రీశైల్ రెడ్డి, దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, ఇంతియాజ్ పటేల్, మజార్, విక్రాంత్, రామకృష్ణ తదితర బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-13 at 20.02.07

About The Author