పొద్దుతిరుగుడు కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన

దున్నపోతుతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన రైతన్నలు


పొద్దుతిరుగుడు కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన

సిద్దిపేట:

పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తొగుట మండల రైతులు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు దున్నపోతుతో తొగుట మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట పొద్దుతిరుగుడు ధాన్యాన్ని పోసి వినూత్న నిరసన తెలిపారు. రైతు చెమటకు విలువ ఇవ్వాలని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఆందోళనలో సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణా రెడ్డి, బీఆర్‌ఎస్ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి తదితరులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.WhatsApp Image 2026-05-12 at 19.33.38 (1)

About The Author