అక్రమ రవాణాను ఉపేక్షించే ప్రసక్తే లేదు.
- - సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలి.
- - డయల్ 100 ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు.
- - తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి.
- - వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర.
- - పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.
వికారాబాద్ :
కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమీక్షించారు.స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ సెంటర్, రికార్డులు, లాకప్ గదులు, బ్యారక్‌లను పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ‘డైల్ 100’ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.పెద్దేముల్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో వరి అక్రమ రవాణా, బక్రీద్ సందర్భంగా అక్రమ పశువుల తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను త్వరగా పట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్, హెడ్ కానిస్టేబుల్ రఫిక్, మహిళా పోలీస్ ముంతాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
