ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ తోడ్పడాలి : కౌన్సిలర్ వనం రమేష్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ తోడ్పడాలి : కౌన్సిలర్ వనం రమేష్

దుబ్బాక:

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ తోడ్పడాలని కౌన్సిలర్ వనం రమేష్ అన్నారు.గురువారం 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 
ధర్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో “మన పాఠశాల – మన బాధ్యత” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, క్రీడలు మరియు ఇతర సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.బడిబాట ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-14 at 19.33.17

About The Author