నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

సర్కార్ పై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శలు

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఎల్బీనగర్:

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నిరుద్యోగ యువతతో కలిసి దిల్ సుఖ్ నగర్ లో వారితో కలిసి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.అదే విధంగా జీవో 29 మరియు జీవో 46లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటు చేసుకున్న అనుమానాలపై సిట్ ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శకంగా విచారణ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ భారాస నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, గండి సన్నీ యాదవ్, నిరుద్యోగులు ఇంద్రా నాయక్, నవీన్, శంకర్, శింబు తదితరులు పాల్గొన్నారు.

About The Author