ఇచ్చిన హామీ అమలు చేసిన రఘువర్ధన్ రెడ్డి
- వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం
- సేవా కార్యక్రమాలను అభినందించిన ఆలయ కమిటీ సభ్యులు
సిద్దిపేట
మాట నిలబెట్టుకునే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి మరోసారి గుర్తింపు పొందారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం ఆయన రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన రఘువర్ధన్ రెడ్డి, ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు స్వయంగా విరాళాన్ని అందించి తన నిబద్ధతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి పట్ల రఘువర్ధన్ రెడ్డి చూపుతున్న చొరవ ప్రశంసనీయమని తెలిపారు. సమాజ సేవతో పాటు ధార్మిక కార్యక్రమాలకు సహకరించడం ఆదర్శనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు..jpeg)
