కార్పొరేషన్ల ఛైర్మన్లకు శివచరణ్ రెడ్డి శుభాకాంక్షలు

కార్పొరేషన్ల ఛైర్మన్లకు శివచరణ్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా నియమితులైన 'సరిత తిరుపతయ్య, రజక సహకార సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన దాసరిరాజు అజయ్ కుమార్,బుధవారం తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇరువురు ఛైర్మన్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి
తమ పదవీ కాలంలో ఆయా సామాజిక వర్గాల సంక్షేమానికి, కార్పొరేషన్ల బలోపేతానికి వారు నిరంతరం కృషి చేయాలని శివచరణ్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author