ప్రజల్లో పోలీసుల పై నమ్మకం పెంచేలా పనిచేయాలి
- జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
- తాండూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
- దొంగతనాల కేసులు,
- పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి..
ఎస్పీ ఆదేశాలు
వికారాబాద్:
దొంగతనాల కేసులు,
పెండింగ్ ఉన్న కేసులు వెంటనే పరిష్కరించాలి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం
తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మికంగా
తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్టేషన్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, అనంతరం పోలీస్ స్టేషన్‌లోని పలు కీలక రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల స్థితిగతులను నిశితంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ...ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాండూర్ పట్టణంలో జరుగుతున్న దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు
రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ, స్థానిక మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో తక్షణమే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
అలాగే కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ తో పాటు స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..jpeg)
