ఆగస్టు 16న గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం రాజ గోపురాల ప్రారంభోత్సవం..
- సాలహారం పనులను వేగవంతం చేయండి..
- గణేష్ గడ్డ దేవాలయం అభివృద్ధికి కృషి..
- పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
- ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో రాజగోపురాల నిర్మాణం..
పటాన్‌చెరు:
గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్టాపన సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
గురువారం ఉదయం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆలయ పురోహితులు, పాలకవర్గం సూచనలతో ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గుడిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి అదనపు ఆదాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
