సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 
  • పటాన్‌చెరు డివిజన్ లో 2 కోట్ల 19 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. 

సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి

పటాన్‌చెరు:

నియోజకవర్గ పరిధిలోని సబ్బండ వర్గాల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఒక కోటి రూపాయల అంచన వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంగళవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం  ఒక కోటి 19 లక్షల రూపాయలతో నిర్మించిన నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం, ఎస్సీ సంఘం స్మశాన వాటికల ప్రహరీ గోడలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  పటాన్‌చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఈ కృష్ణవేణి, బి ఆర్ ఎస్ ఆర్ పార్టీ సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, రామచంద్రారెడ్డి, శ్యామ్, ఎట్టయ్య, వెంకటేష్, శంకర్, రామ్మోహన్, షకీల్, ఆయా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author