సాహెబ్ నగర్ అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు
స్వామివారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
బి.ఎన్. రెడ్డి నగర్:
బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్‌లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.
About The Author
13 May 2026
