ధర్మాజీపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ వనం రమేష్ కృషి
సిద్దిపేట:
దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ బుధవారం ధర్మాజీపేట ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తూ మున్సిపల్ వాహనాల ద్వారా తరలిస్తున్న పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వీధులు, ప్రధాన రహదారుల పరిశుభ్రతపై స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.అలాగే ధర్మాజీపేట పెద్ద చెరువు, చింతల చెరువుల పూడికతీత పనులతో పాటు తూముల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ద చెరువు తూములు దెబ్బతిన్నాయని గుర్తించిన ఆయన, చెరువుల మరమ్మతులు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. వర్షాకాలానికి ముందే చెరువులను పునరుద్ధరిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని స్థానికులు తెలిపారు.
మంత్రులను కలిసిన కౌన్సిలర్ రమేష్
- వార్డులో నెలకొన్న సమస్యలపై వినతి
9వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ వనం రమేష్ హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రులను కలిసి వినతి పత్రం సమర్పించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా వనం రమేష్ తెలిపారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలకృష్ణ, వనం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
