బసవరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం: మంత్రి శ్రీధర్ బాబును కలిసిన లక్ష్మీప్రసన్న, మనీష్ గౌడ్
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌కు ఘన సన్మానం
ఎల్బీనగర్:
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బసవరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం బండ్లగూడలోని వసంత విహార్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, ఎల్బీనగర్ యువ నాయకుడు ముద్దగౌని మనీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రికి ఘన స్వాగతం..
కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు లక్ష్మీప్రసన్న, మనీష్ గౌడ్లు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి అంశాలపై మంత్రితో వారు ముచ్చటించారు. అనంతరం మంత్రి సమక్షంలోనే నూతన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సభలో లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వ ఫలాలు అందేలా నూతన చైర్మన్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మనీష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.jpeg)
