అక్రమ వెంచర్లపై 'మున్సిపల్' ఉక్కుపాదం

  • బాలాపూర్‌లో అనుమతులు లేని లేఅవుట్లు ధ్వంసం
  • మౌలిక వసతుల తొలగింపు.. రియల్టర్లకు అధికారుల హెచ్చరిక

అక్రమ వెంచర్లపై 'మున్సిపల్' ఉక్కుపాదం

బడంగ్‌పేట్:

అనుమతులు లేకుండా వెంచర్లు వేసి సామాన్యులను మోసగించే రియల్టర్ల ఆటకట్టించేందుకు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. సర్కిల్–16 పరిధిలోని బాలాపూర్ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన వెంచర్లపై మంగళవారం అధికారులు మెరుపు దాడులు నిర్వహించి నిర్మాణాలను నేలమట్టం చేశారు.

సామాన్యులే లక్ష్యంగా అక్రమ వ్యాపారం
బాలాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 9, 10, 11లలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చినట్లు గుర్తించిన అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వెంచర్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, భూగర్భ నీటి ట్యాంకులను తొలగించడంతో పాటు, అక్రమంగా వేసిన అంతర్గత రోడ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు.WhatsApp Image 2026-05-12 at 17.04.30 (3)

అనుమతులు చూశాకే కొనుగోలు చేయండి.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 "అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు. భవిష్యత్తులో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాట్లు కొనే ముందు లేఅవుట్ ఆమోదం, రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి."

కిరణ్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ

నిరంతర నిఘా.. ప్రత్యేక డ్రైవ్‌లు:
బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో అనధికార లేఅవుట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమతులు లేని వెంచర్లు గుర్తిస్తే వెంటనే మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి కూల్చివేతలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వి. సమ్మయ్య, టీపీఎస్ దినేష్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-12 at 17.04.30 (2)

About The Author