ఆధ్యాత్మిక వాతావరణంలో వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేత దర్శనం

  • - హనుమాన్ జయంతి వేడుకలు  
  • - పంచవటి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు 

ఆధ్యాత్మిక వాతావరణంలో వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేత దర్శనం

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి గ్రామంలోని పంచవటి హనుమాన్ దేవాలయంలో మంగళవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూజారులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.WhatsApp Image 2026-05-12 at 19.34.03

About The Author