కాంగ్రెస్ ప్రభుత్వంది అసమర్థ, దద్దమ్మ పాలన మోసపూరితంగా అధికారం చేపట్టి 420రోజులు
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి) ఓ జాతిపిత మహాత్మా….మీకు కోటి పాదాభివందనాలు తెలియజేస్తూ…అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధీ ప్రసాదించాలని కోరుతూ బి ఆర్ ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు, మాజీ సుడా ఛైర్మన్ జి.వి. రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గురువారం నగరంలోని పెద్ధపెల్లి రోడ్ లోగల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి పురస్కరించుకొని బి ఆర్ ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ఘనంగా వేడుకలు నిర్వహించారు…ముందుగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుతో తెలంగాణ లో చేతగాని, దద్దమ్మ పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధీ ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు మీడియాతో మాట్లాడుతు మోసపూరితమైన వాగ్దానాలతో అమలు కాని పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు అవుతుందని గుర్తుచేశారు…కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ బిత్తిరి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి ప్రజలను నిత్యం మోసం చేస్తున్నారని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఎన్నికల ముందు 15వేల రూపాయలు ఇస్తామని చెప్పి, తీరా అధికారం చేపట్టక భరోసా కింద 12వేల రూపాయలు ఇస్తామండం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ సొసైటి ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి. మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి)
ఓ జాతిపిత మహాత్మా….మీకు కోటి పాదాభివందనాలు తెలియజేస్తూ…అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధీ ప్రసాదించాలని కోరుతూ బి ఆర్ ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు, మాజీ సుడా ఛైర్మన్ జి.వి. రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గురువారం నగరంలోని పెద్ధపెల్లి రోడ్ లోగల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి పురస్కరించుకొని బి ఆర్ ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ఘనంగా వేడుకలు నిర్వహించారు…ముందుగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుతో తెలంగాణ లో చేతగాని, దద్దమ్మ పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధీ ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు మీడియాతో మాట్లాడుతు మోసపూరితమైన వాగ్దానాలతో అమలు కాని పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు అవుతుందని గుర్తుచేశారు…కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ బిత్తిరి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి ప్రజలను నిత్యం మోసం చేస్తున్నారని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఎన్నికల ముందు 15వేల రూపాయలు ఇస్తామని చెప్పి, తీరా అధికారం చేపట్టక భరోసా కింద 12వేల రూపాయలు ఇస్తామండం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ సొసైటి ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి. మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
