మల్కాజిగిరిలో ‘మత్తు’ వదిలించిన పోలీసులు

  • వారం రోజుల్లో 174 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
  • 12 మందికి జైలు శిక్ష.. 16 మందికి సామాజిక సేవ

మల్కాజిగిరిలో ‘మత్తు’ వదిలించిన పోలీసులు

మల్కాజిగిరి:

రోడ్డెక్కితే చాలు మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో స్టీరింగ్ పట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా (ఏప్రిల్ 12 నుంచి 18 వరకు) కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి.

పట్టుబడింది వీరే..
పోలీసుల తనిఖీల్లో మొత్తం *174 మంది* మద్యం మత్తులో పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ భాగం ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. పట్టుబడిన వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి:
 *టూ వీలర్లు: 146,
 *కార్లు:16,
 *ఆటోలు: 12,
వీరందరిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) టెస్టుల్లో 11 మందికి 200 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

కోర్టులో చుక్కలు..
గత వారం విచారణకు వచ్చిన 249 కేసుల్లో న్యాయస్థానం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మత్తులో బండి నడిపిన,12 మందికి జైలు శిక్ష పడగా, మరో 16 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. మిగిలిన 221 మందికి భారీగా నగదు జరిమానా విధించింది.

10 ఏళ్లు జైలుకే: డీసీపీ రాహుల్ రెడ్డి
మద్యం తాగి వాహనం నడిపి ఎవరి ప్రాణాలైనా తీస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి హెచ్చరించారు.

> "మత్తులో ప్రమాదం చేసి ఎవరైనా చనిపోతే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తాం. దీనివల్ల నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు బాధ్యతగా ఉండాలి." అని ఆయన స్పష్టం చేశారు.WhatsApp Image 2026-04-19 at 18.40.21 (1)

About The Author