కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారని, రాష్ట్రంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందనీ అభిప్రాయపడ్డారు. ఇక కొందరు మంత్రులైతే సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్ లోని కొండా సత్య లక్ష్మీ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ కొత్త మండలాధ్యక్షులుగా నియమితులైన తరువాత తొలిసారిగా ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించాలని, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయాన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయటనుండి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకున్నారని, బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. దీంతో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యంమన్నారు.ఎన్నికల ఫలితాల తరువాత నుండి మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రంలో బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందనీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీ మాత్రమే ఉందనీ నిరుద్యోగులు, టీచర్లు ఉద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు పోయింది మేమేనని,317 జీవోపై దీక్ష చేస్తే నా ఆఫీస్ గేటును గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి టియర్ గ్యాస్ వదిలి అద్దాలు పగలకొట్టి లాఠీఛార్జ్ చేయించారని చెప్పారు. అద్దాలు కాలికి గుచ్చుకుని రక్తమోడుతున్నా కనికరం లేకుండా బరబరా గుంజుకుపోయి జైలుకు పంపారనీ,ఉద్యోగుల పీఆర్సీ, టీఏ, డీఏల కోసం, ప్రతినెలా జీతాలివ్వాలని కొట్లాడి ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ఇందిరా పార్క్ కు గుంజుకొచ్చిన చరిత్ర బీజేపీదేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని, ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల భ్రుతి బాకీ పడ్డరు. ప్రతి టీచర్, ఉద్యోగికి 4 డీఏలు, పీఆర్సీ బాకీ పడ్డరు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ బాకీ పడ్డరు. రైతులకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా పైసలు బాకీ పడ్డరనీ వివరించారు.ప్రతి ఉద్యోగికి సరెండర్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పైసలు బాకీ…ఎటు చూసినా బాకీ…బాకీ…బాకీ… ఇది బాకీల ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి బాదాలని పిలుపునిచ్చారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కోంటోందనీ, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది? మేమేమైనా ఎడ్డోళ్లమా? ముస్లింలను బీసీల్లో ఎట్లా కలుపుతారనీ, మేం మొలదారం కట్టుకుంటాం. మాకు గోత్రం ఉంటది. వాళ్లతో మాకు పోలికేంది? ముస్లింలను బీసీ జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటామని, లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదనీ హితవు పలికారు. కొందరు క్రైస్తవులను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారని, అలాగే మరికొందరు ఎస్సి సర్ట్ఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను నష్టం చేస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, జి. నగేష్, ఎమ్మెల్యేలు కటేపెళ్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, రామచంద్రారెడ్డి, బిడిగే శోభ, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, దిమ్ శంకర్ లు పాల్గొన్నారు.

About The Author