బొంతపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
- 150 విద్యార్థులకు పంపిణీ – సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల :

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులను సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారు స్వయంగా పంపిణీ చేశారు. విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ కనబరచాలని, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొంటూ, వారికి కావలసిన సదుపాయాలను అందించేందుకు సిజిఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు.
About The Author
17 Apr 2026
