జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 30: నిర్మల్ జిల్లా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణ, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులు, గ్రామస్తులతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కడ్తాల్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి పై ప్రమాదాల నియంత్రణకు వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకై అధికారులందరితో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన సంబంధిత అధికారులందరితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించిందన్నారు. సంబంధిత అధికారుల నుంచి వై జంక్షన్ సమస్య పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్తుల నుంచి సమస్య పరిష్కారానికి సూచనలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్ టి ఓ దుర్గా ప్రసాద్, సోన్ తహసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో సురేష్, కడ్తాల్ గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 30:

నిర్మల్ జిల్లా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణ, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులు, గ్రామస్తులతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కడ్తాల్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి పై ప్రమాదాల నియంత్రణకు వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకై అధికారులందరితో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన సంబంధిత అధికారులందరితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించిందన్నారు. సంబంధిత అధికారుల నుంచి వై జంక్షన్ సమస్య పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్తుల నుంచి సమస్య పరిష్కారానికి సూచనలను తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్ టి ఓ దుర్గా ప్రసాద్, సోన్ తహసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో సురేష్, కడ్తాల్ గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author