ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా :
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని, దీనిని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని సూచించారు. అలాగే, ఈ రంగంలో ప్రభుత్వం, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ పంట యొక్క ఆర్థిక ప్రాధాన్యత, సాగు పద్ధతులు, నీటి వినియోగం, వాతావరణ అనుకూలత, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలపై సంబంధిత అధికారులు విశదీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, జిల్లా కోపరేటివ్ అధికారి రామ్మోహన్, పిఎసిఎస్ కార్యదర్శులు, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ప్రతినిధులు, డ్రిప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
