ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు: కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ, గైనకాలాజీల సొసైటి, పథలాజిస్తు, రేడియాలజిస్తుల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నగర పాలక సంస్థ కు చెందిన మహిళా పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి విశేష స్పందన లభించింది…ముందుగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య అధికారి డాక్టర్ కె. వెంకట రమణారావు, ఐ ఎం ఎ జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నరేష్ లతో కలిసి కార్పొరేషన్ కమిషనర్ ఛాహత్ బాజ్ పాయ్ ప్రారంబించారు..ఈ సందర్భంగా వైద్య బృందం కమిషనర్, జిల్లా వైద్య అధికార్లను ఘనంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. కమిషనర్ మాట్లాడుతూ మహిళలు అనారోగ్య సమస్యలు వస్తె వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకొని ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరారు. దీంతో డబ్బులు వృధా కావని చెప్పారు. జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినందుకు నగరంలోని వైద్యులను ముందుగా అభినందించారు. ఇలాంటి వైద్య శిబిరాలను కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. ఐ ఎం ఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా పారిశుధ్య కార్మికులు వైద్య సేవచేసే భాగ్యం ప్రసాధించినందుకు భగవంతుడికి రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో దాదాపు 150మందికిపైగా శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశిచేతన, గైనకాలాజీ సొసైటి కార్యదర్శి డాక్టర్ నయని, ఐ ఎం ఎ జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ లతో పాటు నగరంలోని వైద్యులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి):
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ, గైనకాలాజీల సొసైటి, పథలాజిస్తు, రేడియాలజిస్తుల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నగర పాలక సంస్థ కు చెందిన మహిళా పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి విశేష స్పందన లభించింది…ముందుగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య అధికారి డాక్టర్ కె. వెంకట రమణారావు, ఐ ఎం ఎ జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నరేష్ లతో కలిసి కార్పొరేషన్ కమిషనర్ ఛాహత్ బాజ్ పాయ్ ప్రారంబించారు..ఈ సందర్భంగా వైద్య బృందం కమిషనర్, జిల్లా వైద్య అధికార్లను ఘనంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. కమిషనర్ మాట్లాడుతూ మహిళలు అనారోగ్య సమస్యలు వస్తె వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకొని ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరారు. దీంతో డబ్బులు వృధా కావని చెప్పారు. జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినందుకు నగరంలోని వైద్యులను ముందుగా అభినందించారు. ఇలాంటి వైద్య శిబిరాలను కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. ఐ ఎం ఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా పారిశుధ్య కార్మికులు వైద్య సేవచేసే భాగ్యం ప్రసాధించినందుకు భగవంతుడికి రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో దాదాపు 150మందికిపైగా శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశిచేతన, గైనకాలాజీ సొసైటి కార్యదర్శి డాక్టర్ నయని, ఐ ఎం ఎ జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ లతో పాటు నగరంలోని వైద్యులు పాల్గొన్నారు.
