పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు
ఆయుధ, వాహన పూజల్లో పాల్గొన్న సిపి గౌష్ ఆలం
కరీంనగర్ :

జిల్లా కేంద్రంలోని కమీషనరేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో దసరా పండగ సందర్బంగా ఆయుధ , వాహన, జమ్మి పూజల్లో కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ అలం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఏ.ఆర్)భీం రావు, ఏసీపీలు విజయ్ కుమార్ రిజర్వు ఇన్స్పెక్టర్లు లు రజినీకాంత్, జానీమియా, శ్రీధర్ రెడ్డి , కిరణ్ కుమార్, సిఐలు శ్రీనివాస్, రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, బిల్లా కోటేశ్వర్ , సరిలాల్ లతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
29 May 2026
