ఏసిబి వలకు చిక్కిన ఎస్సై రంజిత్

మణుగూరు :

-స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 డిమాండ్ 

WhatsApp Image 2025-09-26 at 6.17.07 PM

మణుగూరు పోలీస్ స్టేషన్లలో ఏసిబి రైడ్ లో సబ్ ఇన్స్పెక్టర్ బత్తిని రంజిత్ పట్టుబడడంతో మండలంలో కలకలం రేపుతోంది. ఇంచార్జీ యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్ డిఎస్పీ విజయ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చీటింగ్ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నిందితుల దగ్గర రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు ఆడియో, విడియో రికార్డుల ప్రకారం శుక్రవారం అదుపులోకి తీసుకున్నామని మీడియా కు తెలిపారు. వారం రోజుల క్రితం స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై డిమాండ్ చేసిన రూ.40 తీసుకొని పొలీస్ స్టేషన్ కు నిందితులు రాగా అనుమానం వచ్చి తిరిగి పంపించడం జరిగిందని తెలిపారు. తర్వాత నుండి పదే పదే చరవాణి ద్వారా ఫోన్ చేసి అడగడంతో వాటిని రికార్డు చేసి వాటి ఆధారంగా చేసుకొని ఎస్సై ని పట్టుకోవడం జరిగిందని ఇంచార్జీ డిఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు. ఏడు నెలల క్రితం ఇదే స్టేషన్లో సిఐ ని ఏసిబి రైడ్ చేసి పట్టుకోవడంతో మండల ప్రజలకు చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఖాకీలు ఆమ్యామ్యాలకు చేతులు చాచడంతో అపకీర్తి మూటకట్టు కుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు సిఐ, నేడు ఎస్సై ఏసీబీకి పట్టుబడడంతో మండల ప్రజలు పోలీసులపై విశ్వసనీయత కోల్పోతున్నారు. 

About The Author