సామాజిక సేవలకు గుర్తింపుగా బుంగపట్ల యాకయ్య కు పండుగ సాయన్న సేవా పురస్కారం
యాదాద్రి జూలై 2: మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు బుంగపట్ల యాకయ్య ముదిరాజ్ కోవిడ్ ఆపద సమయంలో నిర్వహించిన సామాజిక సేవలను గుర్తించి పండుగ సాయన్న సేవా పురస్కారం అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పురస్కార ప్రశంసా పత్రం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. బుంగపట్ల యాకయ్య తెలంగాణ రాష్ట్రంలోని పలు రంగాలలో చేసిన సామాజిక సేవలను వారు కొనియాడారు. సెంట్రల్ యూనివర్సిటీ ఓ బి సి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు అందే బాబన్న , రమేష్, బైరి శంకరన్న , పిట్ల నాగేష్ ,కోట్ల పుష్పలత ,నిజ్జనం రమేష్ , అంచ రాములు , కురుమూర్తి నరసింహ తదితరులు పాల్గొన్నారు.