భర్తతో గొడవపడి వచ్చిన మహిళ సరూర్ నగర్ లో అదృశ్యం
ఎల్బీనగర్:
సరూర్ నగర్ డివిజన్ పంజాల అనీల్ కుమార్ కాలనీలో నివాసం ఉండే మేడమోని యాదమ్మ అనే మహిళ కూతురు వంగూరి శ్రీలత (28) భర్త శ్రీశైలంతో గొడవపడి అమ్మ వారి ఇంటికి వచ్చింది. పిల్లలను వదిలి రావడం మంచిది కాదు నీ భర్తను సంజాయించి భర్కత్ పల్లిలో మీ ఇంటి కాడ వదిలి వస్తానని తల్లీ యాదమ్మ నచ్చ చెప్పింది.సరే అని చెప్పిన శ్రీలత తెల్లవారు జామున బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువులను, స్నేహితులను వాకబు చేసింది.ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని సీఐ శ్రీశైలం తెలిపారు.
