మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా ప్రతినిధి :
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. ములుగు జిల్లా వేంకటపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామము లోని మారేడుగొండ చెరువులో గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ & స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాదు రఘు, జిల్లా మత్స్య శాఖ అధికారి టి.సల్మాన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాదు శంకర్ లతో కలిసి చేప పిల్లలను చెరువు లో వదిలారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ పి.రమేష్, ఎఫ్.ఎ.ఎన్. మౌనిక, ప్రజా ప్రతినిధులు, మత్స్య కారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
09 Mar 2026
